ఉడికించిన గుడ్డు.. వేయించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది గుడ్..?

-

గుడ్లు ఆరోగ్యానికి మంచిదని అందరూ చెప్తారు. కానీ గుడ్లను తినడంలో ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి. కొందరు ఆమ్లెట్ వేసుకుని తింటారు. మరికొందరు వేయించుకుని కూరల్లో వండుకుంటారు. మరికొందరు ఉడకపెట్టుకున తింటారు. ఇంకొందరికైతే..వీటిల్లో ఆప్షన్స్ ఉంటాయి. వైట్ తింటే లోపల పార్ట్ తినరు. అయితే గుడ్లలో ఉడికించిన గుడ్డు మంచిదా.. వేయించుకుని తినే గుడ్డు మంచిదా అనేది మన టాపిక్..

బరువు అదుపులో ఉండాలంటే మాత్రం ఉడకబెట్టిన గుడ్లు తినడం మంచిది. ఎందుకంటే వేయించిన గుడ్డులో కేలరీల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. బీపీ ఎక్కువగా ఉన్నవారు వేయించిన గుడ్డుకి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. కానీ చిన్నపిల్లలకి వేయించిన గుడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉడికించిన గుడ్లను తినవచ్చు. అలాగే అధిక బీపీ ఉన్నవారు ఉడికించిన గుడ్లు తింటే ఏమి కాదు.

గుడ్డులోని తెల్లసొనలో అత్యధిక ప్రొటీన్లు ఉంటాయి. ఉడికించిన గుడ్లలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుడ్లను నూనెతో వేయించడం వల్ల శరీరానికి ఉపయోగపడే పదార్థాలు నాశనం అవుతాయి.

గుడ్డులోని తెల్లసొన భాగంలో చాలా విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఒక గుడ్డులో దాదాపు 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. గుడ్లలో అమినో యాసిడ్స్, విటమిన్ బి12, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే కోలిన్ గుడ్లలో ఉంటుంది. గుడ్లను ఉడకబెట్టి మాత్రమే తినాలి. అలా కాకుండా ఉడికించిన గుడ్డును నూనెలో వేయించి తింటే కేలరీలు ఎగిరిపోతాయి. ఇక గుడ్డును ఆమ్లెట్‌లో వేసుకుని తింటే సగం కేలరీలు కూడా మిగిలి ఉండవు. అందుకే ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి మంచిది.

కాబట్టి గుడ్లను తినే వారు.. ఉడికించిన లేదా ఆఫ్ బాయిల్ చేసిన గుడ్లను తింటే.. అన్నీ పోషకాలు లభిస్తాయి. రోజుకో గుడ్డు తినమన్నారు కదా.. అని మన ఇష్టవచ్చినట్లు తింటే.. అందులో ఎలాంటి ప్రయోజనం ఉండందంటున్నారు వైద్య నిపుణులు. టేస్టీగా లేకున్నా ఎడ్జస్ట్ అయిపోయి.. బాయిల్డ్ ఎగ్ తినడమే బెటర్.

Read more RELATED
Recommended to you

Latest news