ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని మొత్తం 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె నాలుగో రోజు కూడా కొనసాగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. `చట్టబద్ధంగా నోటీసు ఇచ్చి సమ్మెకు దిగిన కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తానని సీఎం కేసీఆర్ అంటున్నారు. ఆరేళ్లుగా సచివాలయానికి రాని ఆయనపైన పీడీ చట్టం ప్రయోగించి.. అండమాన్ జైల్లో పెట్టాలా?` అని ప్రశ్నించారు.
విచారణకు రాబోతున్న కేసుల విషయం లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసేందుకు సమయం ఉంటుంది కానీ 35 రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులను పిలిచి మా ట్లాడేందుకు కేసీఆర్‌కు తీరిక లేదా అని మండిపడ్డారు. 50వేల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డుపైకి తెస్తానంటే తెలంగాణ సమాజం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఏ ఉద్యోగాలనూ కేసీఆర్ తీయలేడని, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు.