TSPSC తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలోనే పెట్టారు – రేవంత్ మరో బాంబ్‌

-

TSPSC తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలోనే పెట్టారని రేవంత్ రెడ్డి మరో బాంబ్‌ పేల్చారు. సిట్ విచారణ అధికారి AR శ్రీనివాస్ ఎక్కడి వాడు… ఆయన కూడా ఆంధ్ర వాడే అంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం డీఎన్ఏ విద్యార్ధి ఉద్యమమని… 30 లక్షల నిరుద్యోగుల గోస పట్టదా అని ప్రశ్నించారు. విచారణ సరిగ్గా జరగాలని నేను కోరితే నాకు నోటీసులు ఇచ్చారని… సిట్ అధికారి ఆంధ్ర అధికారి ఐనప్పుడు రిపోర్ట్ ఎలా ఉంటుందన్నారు.

తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లంతా ఎక్కడ పోయారని నిలదీశారు. TSPSC లో వున్న సిస్టమ్ లకు భాద్యులు ఐటీ శాఖ పరిధిలోనిదేనని…. ఐటీ యాక్టు ప్రకారం అడిట్, స్క్రూటినీ చేయాల్సింది వారేనని విమర్శలు చేశారు.పిరియాడికల్ అడిట్ చేయాలి… ఓనర్ చైర్మన్, సెక్రెటరీ ఐతే కాపలాదారు శంకర్ లక్ష్మి.. పనోళ్ళు ప్రవీణ్, రాజశేఖర్లు అని ఆరోపించారు. ఈ కేసులో పనోల్లతో క్లోస్ చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఐటీ అంత కేటీఆర్ చేతిలో ఉంటుంది… కానీ కేటీఆర్ తెలివిగా నా పరిధి కాదంటున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని నిలదీశారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news