ఢిల్లీలో టిఆర్ఎస్ భవన నిర్మాణం : రేవంత్ సంచలన ఆరోపణలు

ఇవాళ ఢిల్లీ లో టిఆర్ఎస్ పార్టీ భవనం శంకుస్థాపన జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టిఆర్ఎస్ పార్టీ భవనం నిర్మాణం పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో దక్షిణ భారత దేశములో ఉన్న ఏ పార్టీ కి భూములు ఇవ్వలేదని.. కానీ కెసిఆర్ లో ఏం నచ్చిందో..మోడీ కి… టిఆర్ఎస్ కి భూమి ఇచ్చారని మండిపడ్డారు.

ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ చేస్తున్నారని కెసిఆర్, మోడీ లపై ఫిరా అయ్యారు. నీటి కేటాయింపుల వివాదం కంటే ఢిల్లీలో భవన్ నిర్మాణం ముఖ్యం అయ్యిందన్నారు. ఢిల్లీలోనే కెసిఆర్ ఉన్నారు కదా..నీటి వాటాలో అన్యాయంపై ఆమరణ దీక్ష చేయాలని డిమాండ్ చేశారు రేవంత్. తాము పోలీసులు అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. కెసిఆర్..మోడీ ఇద్దరు దోస్తులు అని.. పాపం.. బండి సంజయ్.. మోకాలి చిప్పలు ఆరిగినా.. నీకు మోడీ ప్రసన్నం కాదన్నారు. కెసిఆర్ కి ప్రసన్నం అవుతాడు కానీ..బండి సంజయ్ కి కాడని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. ఎందుకు బండి.. తట్టా బుట్ట సర్దుకుని ఇంటికి పో అంటూ రేవంత్ చురకలు అంటించారు.