7వ తరగతి ఫెయిలైన వెధవ, మూర్ఖుడు లోకేష్ : లక్ష్మీ పార్వతి

తాడేపల్లి : వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మరోసారి చంద్రబాబు, నారా లోకేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ చనిపోయి 12 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఆయన బతికి ఉంటే అన్న మాట వినిపిస్తునే ఉంటుందని.. 14 ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు మాటలు వింటూ ఉంటే వీళ్ళు నాయకులు ఎలా అయ్యారు అని అనుమానం వస్తుందన్నారు.

లోకేష్ స్థాయి ఏంటో అందరికీ తెలుసు అని.. ఏడో తరగతి ఫెయిల్ అయిన వెధవ, మూర్ఖుడని నిప్పులు చెరిగారు. లోకేష్, చంద్రబాబు మాట్లాడుతున్న మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తోందన్నారు. మా నాయకుడు ఒక్క సైగ చేస్తే చాలు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జగన్ ను విమర్శించే నైతిక హక్కు తండ్రి, కొడుకులు ఇద్దరికీ లేదని నిప్పులు చెరిగారు. ఒక్క కేసు విచారణ చేస్తే చాలు తండ్రి, కొడుకులు ఇద్దరికీ 100 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని మండిపడ్డారు లక్ష్మీ పార్వతి.