రాష్ట్ర సంపదను దోచుకున్న వారిని పరుగెత్తిస్తాం : రేవంత్ రెడ్డి

-

తెలనగానలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ను వచ్చే ఎన్నికల్లో గెలవనిచ్చేలా లేరు. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో ఎన్నికల మీద ఇచ్చిన హామీలను గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కల్లబొల్లి హామీలు ఇక్కడ చెల్లవు అన్నారు. ఈ కామెంట్స్ పై పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.. ఈయన సోషల్ మీడియా వేదికగా సోనియాగాంధీ తెలంగాణ కోసం ఇచ్చిన హామీలను చూసి అయ్యా కొడుకులు లుంగీలు చింపుకుంటున్నారని మాస్ స్టైల్ లో కామెంట్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేస్తుంది కాంగ్రెస్ అంటూ… మేము గెలిచాక 100 రోజుల్లోనే హామీలను నెరవేరుస్తాము అంటూ రేవంత్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఆ తర్వాత తెలంగాణ సంపదను దోచుకున్న తోడు దొంగలను ప్రజల సాక్షిగా పరుగులు పెట్టిస్తాము అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news