కేసీఆర్ ను టార్గెట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. వ్యూహమేనా..?

-

ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను.. సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారా..? ఆయన్ని బయటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారా..? ఇగోను టచ్ చేస్తే కేసీఆర్ బయటికి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా..? ఆయన మాటల్లో ఏమైనా ఎత్తుగడ ఉందా..? ఇంతకీ తెలంగాణలో ఏం జరుగుతోంది.. కేసీఆర్ మౌనాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు బ్రేక్ చెయ్యాలని చూస్తున్నారు..?

కేసీఆర్.. రాజకీయాల్లో కాకలుతీరని అపరచాణుక్యుడు.. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు.. స్వంతంగా పార్టీ పెట్టి.. తెలంగాణవాదంతో బలంగా ప్రజల్లోకి వెళ్లారు.. తెలంగాణ రాష్టం ఇచ్చింది కాంగ్రెస్ అయినా.. తన క్రెడిట్టే అంటూ రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. హ్యట్రిక్ ఖాయమనుకున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ దెబ్బకొట్టింది.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. కేసీఆర్ ఒకటి రెండు సందర్బాల్లోనే బయటికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.. తర్వాత స్టేట్ షేక్ అయ్యే అనేక ఘటనలుఏ జరిగినా.. బయటికి రాలేదు.. ఒక్క విమర్శ కూడా చెయ్యలేదు.. మంత్రులు నేరుగా విమర్శలు చేస్తున్నా.. లైట్ తీసుకుంటున్నారు.. దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.. కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి బరస్ట్ అవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..

కేసీఆర్ ఇగోను టచ్ చేసేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పి ఓడించా..పార్లమెంట్‌ ఎన్నికల్లో గుండు సున్నా సీట్లే అని చెప్పా.. చేసి చూపించా..మళ్లీ చెప్తున్నా బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వను రాసి పెట్టుకోండి అంటూ సవాల్‌ చేస్తున్నారు రేవంత్. అంతేకాదు దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ గులాబీ దళపతి ఇగోను టచ్‌ చేసి ప్రయత్నం చేస్తున్నారు ఆయన..

ఫామ్ హౌస్ లో తనను కలుస్తున్న సీనియర్ల వద్ద కేసీఆర్ రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారట.. సీఎం రేవంత్ రెడ్డినిఉద్దేశించి పల్లెత్తి మాటకూడా అనడం లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. కానీ సీఎం రేవంత్ మాత్రం పర్సనల్ అటాకింగ్ చేస్తున్నారు.. ఆయన్ని రెచ్చగొట్టి బయటికి తీసుకురావడానికి ఇదో ఎత్తుగడ అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. వరంగల్ సభ చూసిన..ఎవరికైనా ఇదే అర్దం అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తారో లేక.. ఎప్పటిలాగే మౌనంగానే ఉంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news