రాహుల్ గాంధీ మాటకు మేమందరం కట్టుబడి ఉన్నం : భట్టి

-

అదానీని అరెస్ట్ చెయ్యాలంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసినఁగ సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేయాల్సిందేనన్న రాహుల్.. రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా.. అరెస్ట్ చెయ్యాల్సిందే అని పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. రాహుల్ గాంధీ.. అదానీ లాంటి వారికి మోడీ దేశ సంపద దోచి పెడుతున్నారు అని చెప్పారు. బీజేపీ దేశ సంపదను.. కొద్ది మంది పెట్టుబడి దారులకు కట్టబెడుతున్నారు. దేశ సంపదని మేము నిర్మిస్తే..మోడీ అమ్ముతున్నాడా లేదా సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు.

ఇక తెలంగాణకి అదానీ వస్తె.. మేమేం ఆయనకు రాష్ట్రాన్ని అపగించడం లేదు. అయితే రాహుల్ గాంధీ మాటకు మా సీఎంతో పాటు కేబినెట్ మొత్తం కట్టుబడి ఉంది. ఇక హరీష్ రావు ఇంట్లో మహిళలు ఉంటే ఆర్టీసీ బస్సు ఎక్కించండి. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న వాళ్లకు బిల్లు వస్తె చెప్పమనండి. మా లాగా కాంగ్రెస్ వాళ్ళు హామీలు అమలు చేయొద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ వార్షికోత్సవాలలో మేము మరికొన్ని ఉద్యోగ నియామకాలు చేపడుతున్నం అని భట్టి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news