రేవంత్‌రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ 6 గ్యారెంటీలపై లేదు : బండి సంజయ్ కుమార్

-

సీఎం రేవంత్ రెడ్డి బిజెపి పై తరచుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల జరిగిన ఒక సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై బండి సంజయ్ కుమార్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. మిగిలేది గాడిద గుడ్డేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ సెటైర్లు వేశారు.

 

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ హామీ ఇచ్చిన గ్యారెంటీలపై లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టబోమని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని అన్నారు. మరోసారి మోడీ, అమిత్ షాపై మాట్లాడితే ఖబర్దార్ అని బండి సంజయ్వార్నింగ్ ఇచ్చారు . ఫేక్ వీడియోలతో ప్రజలకు మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news