తెలంగాణా కాంగ్రెస్ లో ఇప్పుడు పీసీసీ పదవి విషయంలో పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ పదవి విషయంలో ఇప్పుడు కొందరు నేతలు కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. పీసీసీ పదవికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు కొందరు అంటున్నారు. ఆయన ట్రై చేయడం కొందరు నేతలకు అసలు నచ్చడం లేదు. దీనిపై సర్వత్రా కూడా ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
చాలా మంది ఉత్తమ కుమార్ రెడ్డిని కొనసాగించాలి అని అంటున్నారు. ఇక సీనియర్ నేతలు అందరూ కూడా ఉంటే ఉత్తమ కుమార్ రెడ్డికి పదవి ఉండాలి లేదా మాకు అయినా ఇవ్వండి అంతే గాని ఎవరికి పడితే వాళ్లకు పదవులు ఇవ్వొద్దని కొంత మంది వాళ్ళ వాళ్ళ సామర్ధ్యం గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు అని అది పార్టీకి పెద్ద దెబ్బ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. మారిస్తే త్వరగా మార్చమని చెప్తున్నారు.
చాలా మంది అయితే ఉత్తమ కుమార్ రెడ్డి ఉండటమే మంచిది అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రయత్నాలు మానేసి తన పని తాను చూసుకునే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఎంపీ గా ఉండటమే గాని రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో తనకు ఏ జోక్యం వద్దు అని అతను భావించాడు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఉత్తమ కుమార్ రెడ్డికి రేవంత్ కి మంచి సంబంధాలు ఉన్నా నేతల నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో వస్తుంది.