దేశ రాజధానిలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. కేంద్రం పారామిలటరీ బలగాలను మోహరించడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. ఢిల్లీ కొత్త కమీషనర్ గా సమర్ధవంతమైన అధికారిగా పేరున్న ఐపిఎస్ అధికారి శ్రీవాత్సవ ను నియమిస్తూ ఆదేశాలు జారి చేసింది. ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో ఆయన అయితే సమర్ధవంతంగా వ్యవహరిస్తారని భావించింది.
శనివారం ప్రస్తుత పోలీస్ కమీషనర్ అమూల్య పదవీకాలం ముగియనున్న నేపధ్యంలో కేజ్రివాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఢిల్లీ లో హత్యకు గురైన ఢిల్లీ ఐబి కీలక అధికారి అంకిత్ శర్మను దారుణంగా హతమార్చినట్టు వైద్యులు తెలిపారు. ఇటీవల అల్లర్లలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దారుణంగా హత్యకు గురైన ఆయన్ను నిర్జీవంగా గుర్తించిన అధికారులు ఆస్పత్రికి తరలించారు.
పోస్ట్ మార్టం నివేదికను తాజాగా బయటపెట్టారు. ఈ రిపోర్ట్ లో సంచలన విషయాలను బయటపెట్టారు. దాదాపు 400 కత్తిపోట్లు ఆయన శరీరంపై ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఆయన మృతదేహా౦లో ప్రతీ భాగం దుండగులు చిద్రం చేసినట్టు వెల్లడించారు. చిత్ర హింసలకు గురి చేసి చంపినట్టు వెల్లడించారు. అంకిత్ శర్మ మృతదేహం మీద కర్ర దెబ్బలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన్ను దారుణంగా హత్య చేసారని గుర్తించారు.
ఆరు గంటల పాటు ఆయన్ను హింసించి చంపారు అని ఇలాంటి హత్యను తాము ఎప్పుడూ చూడలేదని వైద్యులు వెల్లడించారు. ఇది ఒక పీడకల అని పేర్కొన్నారు. మృతదేహాన్ని పేగులు బయటకు లాగారని చెప్పారు. హత్య తర్వాత మృతదేహాన్ని మురుగు కాలువలో పడేసారు. సుమారు ఆరుగురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని వైద్యులు చెప్పారు. ఒక్క భాగాన్ని కూడా వదలకుండా కత్తి పోట్లు పొడిచారని పేర్కొన్నారు.