స్వీట్‌కార్న్‌ ఎందుకు తింటున్నారా? రుచికోసమేనా? ఇంకేదైనానా..

-

స్వీట్‌కార్న్‌. డైట్‌ ఫాలో అవే మహిళలు ఎక్కువగా తినే ఆహారం స్వీట్‌కార్న్‌ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది త్వరగా జీర్ణమయ్యే ఆమారం. సాయంత్రం సమయంలో ఆరుబయట కూర్చొని ఫ్రెండ్‌తో కలిసి వేడివేడిగా స్వీట్‌కార్న్‌ తింటుంటే ఆ మజానే వేరబ్బా! స్వీట్‌ కార్న్‌ ఎందుకు తింటారు అంటే అది చాలా రుచిగా ఉంటుంది. అందుకే తింటాం అంటారు. తినే ప్రతీది రుచికోసమే కాదు అందులో మనకు తెలియని ఎన్నో పోషకాలున్నాయి. అంతేకాకుండా దీంతో శరీరానికి ఎంతో మేలు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోనాల గురించి కూడా తెలుసుకుందాం.

 

– స్వీట్‌కార్న్‌ ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. దీనిలో అత్యధికంగా ఫైబర్‌ ఉంటుంది. లోకొలెస్ట్రాల్‌ లెవల్‌కు సహాయపడుతుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్స్‌ డిఫరెంట్‌ టైప్స్‌ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది.

– డయాబెటిస్‌ రోగులు మొక్కజొన్న తిన్నట్లయితే శక్తి లభించి, నీరసం తగ్గుతుంది. ఇందులోని పొటాషియం రక్తపోటు నియంత్రించి అధిక రక్తపోటు రాకుండా చేస్తుంది. గుండెకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

– స్వీట్‌కార్న్‌లో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. పీచు మలబద్ధకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కూడా కాపాడుతుంది.

– గర్భిణీ మహిళలు తమ ఆహారంలో స్వీట్‌ కార్న్‌ తప్పక చేర్చుకోవాలి. దీంట్లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళల కాళ్లు చేతులు వాపురాకుండా చేస్తాయి. అలాగే స్వీట్‌కార్న్‌లో విటమిన్‌ బి12, ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి ఉండడం వల్ల రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

– మొక్కజొన్నలో శరీరానికి ముఖ్యంగా అవసరం అయ్యే మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌, సెలీనియం వంటి మన శరీరంలోని అనే జీవక్రియలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతాయి.

– ముఖ్యంగా పాస్పరస్‌ ఎముకల ఆరోగ్యానికి, కిడ్నీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news