గద్వాల్ జిల్లాలో పోలీసులకి రెవెన్యు శాఖకు మధ్య చిచ్చు !

-

జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాలలో పోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం చుట్టూ హైడ్రామా నెలకొంది. ఏకంగా ఇది రెవెన్యూ వర్సెస్ పోలీస్ వార్ గా మారింది. జిల్లా కేంద్రంలోని రేఖ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ వుంచిన పిడీఎస్ బియాన్ని పోలీస్ లు పట్టుకున్నారు. అయితే పోలీస్ లకు ఇలా పట్టుకునే అధికారాలు లేవని రెవిన్యూ, సివిల్ సప్లై అధికారులు విడిచిపెట్టినట్టు సమాచారం. భారీగా ముడుపులు తీసుకొని కేస్ ని రెవిన్యూ అధికారులు తారుమారు చేసినట్టు చెబుతున్నారు.

Ration
Ration

పోలీసుల ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. స్టాక్ పాయింట్ నుంచి బియ్యం లోడ్ తో లారీ రైస్ మిల్ కు వచ్చినట్లు గుర్తించారు. ఇక జోగుళాంబ గద్వాల జిల్లా అక్రమ రేషన్ దందా కు అడ్డాగా గద్వాల మారింది. జిల్లా కేంద్రంలోని రేఖ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వవుంచిన పిడీఎస్ బియాన్ని పోలీసులు ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అయితే నిందితులను కాపాడేందుకు రెవిన్యూ అధికారుల యత్నించడం కలకలం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news