గన్నవరంలో వైసీపీ నేతలకు షాకిచ్చిన పోలీసులు

-

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలకు షాకిచ్చారు పోలీసులు. యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు బంద్ చేశారు. కేక్ కటింగ్ చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వై.ఎస్.ఆర్ పార్టీ మాజీ గన్నవరం ఇంచార్జ్, కృష్ణాజిల్లా కె డి.సి.సి చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలకు పోలీసులు ఎటువంటి అనుమతులు ఇవ్వ లేదు. పుట్టినరోజు వేడుకలు ఎక్కడా బహిరంగంగ ప్రదేశాలుల్లో చెయ్య కూడదని పోలీసులు యార్లగడ్డ అభిమానులుకు ఆంక్షలు విధించారు.


గన్నవరంలో 144 ,30 పోలీస్ యాక్ట్ నిబంధనలు ఉన్నాయని ఎక్కడ కేక్ కట్టింగ్, ప్లెక్సీ లు ,గుంపులు గా జనాలు రోడ్డు పై కి రాకూడదని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల మీద యార్లగడ్డ వెంకట్రావు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యార్లగడ్డ వెంకట్రావు ఏమైనా తప్పులు చేసారా, దోపిడీలు చేసారా ఎందుకు అని ఇటువంటి ఆంక్షలు పెట్టారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం మాకు పైన నుండి వచ్చిన ఆడర్స్ అని చెపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news