గజ్వేల్ సభ కు బయలుదేరిన రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు సొంత ఇలాక అయిన గజ్వేల్ నియోజక వర్గం లో ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో… గజ్వేల్ నియోజక వర్గంలోని దళిత గిరిజన దండోరా సభ కు బయలు దేరారు కాంగ్రెస్‌ పార్టీ టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్ రెడ్డి.

ఎంపీ రేవంత్‌ రెడ్డి తో సహా రాజ్య సభ సభ్యులు మల్లిఖార్జున ఖర్గే మరియు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి ఠాగూర్ కూడా పాల్గొనున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల సమయం లో గజ్వేల్ సభకు మల్లిఖార్జున ఖర్గే, ఠాగూర్, రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక గజ్వేల్ నియోజక వర్గం లో జరిగే కాంగ్రెస్‌ పార్టీ దళిత గిరిజన దండోరా సభ కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్‌ నాయకులు. సుమారు ఈ దండోరా సభకు దాదాపు లక్ష మంది కార్యకర్తలు, ఇతరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.