తెలంగాణలో రేవంత్, కేటీఆర్ మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. మొదటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా విభేదాలు ఉన్నాయి. అందుకే వీలు చిక్కినప్పునడల్లా ఒకరిపై మరొకరు విరుచుకు పడుతుంటారు. ఇక రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత ఆయన ప్రతి విషయంలోనూ కేటీఆర్‌ను నేరుగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో కేటీఆర్ కూడా రేవంత్ ను టీడీపీ మనిషి అంటూ విమర్శిస్తున్నారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం పెరిగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నేత ఈ వైరాన్ని మరింత పెంచేశారు.
హైదరాబాద్‌లో ఐటీ హబ్‌లను మరింతగా కీలకంగా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం బాగానే ప్రయత్నిస్తోంది. ఇక ఇందుకోసం హైదరాబాద్ శివారులో ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. కాగా దీన్ని పరిశీలించేందుకు పార్లమెంటరీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వచ్చారు. అయితే ఆయన కేటీఆర్ ఆహ్వానం మేరకు వచ్చి వాటిని పరిశీలించేందు వెల్లారు.
అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై కొన్ని ప్రశంసలు చేయడంతో రేవంత్‌రెడ్డికి మింగుడు పడలేదు. తాను ఇంత పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ నేత ఇలా చేస్తారంటూ అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ శశిథరూర్ ఒక గాడిద అంటూ తీవ్రమైన పదజాలంతో దూషించారు. అలాంటి వ్యక్తిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలంటూ చెప్పారు. వాస్తవానికి శశిథరూర్‌ను ఆహ్వానించినందుకు ఆయన అలా చెప్పడం తప్పేమీ కాదు. కానీ రేవంత్ ఇలా అనే సరికి దీనిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఒక స్థాయి సంఘం సభ్యుడిగా శశిథరూర్ వస్తే ఆయన్ను గాడిద అంటున్న స్థాయి, వ్యక్తిత్వం ఎలాటిదో అందరికీ తెలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ వార్ పెరిగిపోయింది.