ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన 2000 మంది వారి వివరాలను తప్పుగా ఇవ్వడంతో, అధికారులు వాళ్లకు సమాచారం ఇవ్వడంలో విఫలం అయ్యారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం… ప్రజలకు ప్రాణసంకటం.కరోనా పై కేసీఆర్ పాలన ఫాంహౌస్ లో మత్తుగా జోగుతోంది. ప్రజలారా మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి. తస్మాత్ జాగ్రత్త! @TelanganaCMO @ICMRDELHI pic.twitter.com/1GdMgHgEMg
— Revanth Reddy (@revanth_anumula) July 18, 2020