ఏ పార్టీ బతకాలన్నీ లేదా మనుగడ సాగించి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నా పోరాటాలతోనే ప్రజల్లో పేరు తెచ్చకోవాలి. లేదంటే ఆ పార్టీని ఎవరూ విశ్వసించరు. ఈ పాయింట్ ను మొదటి నుంచి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బాగానే వంటపట్టించుకున్నారు. ఇందుకోసం తాను అధ్యక్షుడు అయినప్పటి నుంచే పక్కాగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సంచలన పోరాటానికి రెడీ అవుతున్నారు కాంగ్రెస్ బాస్.
అయితే ఈ పోరాటం కూడా రెండు వర్గాల ఓట్లను ఆకర్సించేందుకే నని తెలుస్తోంది. అది దళిత, గిరిజన ఓట్లని తెలస్తోంది. ఇక ఇప్పడు హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీమ్‌ను తీసుకొచ్చి ఆ వర్గం ఓట్లను టార్గెట్ చేశారు. దీంతో ఇప్పుడు రేవంత్ దళిత, గిరిజన వర్గాలు టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ వైపు వచ్చేలా ఎత్తుగడ వేస్తున్నారు. అసలు మొదటి నుంచి టీఆర్ ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు దళిత, గిరిజన వర్గాలు.
దీంతో ఈ పాయింట్‌ను ఆసరాగా చేసుకున్న రేవంత్ రెడ్డి ఎలాగైనా వారికి దగ్గరయ్యేందుకు వారు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండేలా చూసేందుకు ఇంద్రవెల్లి వేదికగా పెద్ద ప్లాన్ వేశారు రేవంత్ రెడ్డి. వచ్చే నెల ఆగస్టు 9నుంచి ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా పోరాటాన్ని రేవంత్ స్టార్ట్ చేస్తున్నారు
అయితే ఇంద్రవెల్లిలో ఎక్కువగా ఆదివాసీలు ఉండటంతో వారిని ఆకట్టుకుంటున్నట్టు ఉంటుందనే ఇక్కడి నుంచే తన పోరు యాత్ర ద్వారా కాంగ్రెస్‌కు దూరమైన ఈ దళిత, గిరిజన వర్గాలను మళ్లీ దగ్గర చేసుకునేందుకు రేవంత్ ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దండోరాను సెప్టెంబర్ 17వరకు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. రేవంత్ ఈ పోరులో పెద్ద ఎత్తున కార్యకర్తలను, ఆదివాసీలు, దళితులను భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళిక వేస్తున్నారు. ఇక ఇందులో కేసీఆర్ దళితులకు, గిరిజనులకు చేసిన మోసాలను ఎత్తి చూపించనున్నారు.