ఇప్పుడు తెలంగాణలో వ్యూహాత్మక రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఆరోపణలు, ప్రత్యారోపనల చుట్టూ తిరగిన రాజకీయాలు కాస్తా హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని కొత్త స్కీములు, కొత్త ఎత్తుగడలతో రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ హుజూరాబాద్ కోసం గతంలో ఎన్నడూ లేనన్ని స్కీములు, నిధులు పెడుతున్నారు. ఇక నియోజకవర్గంలో బలంగా ఉన్న దళితుల కోసం ఏకంగా దళిత బంధు స్కీమునే పెట్టాడంటే ఏ స్థాయిలో దీన్ని తీసుకుంటున్నారో చెప్పొచ్చు.రేవంత్ రెడ్డి Revanth Reddy కొత్త ప్లాన్ ఇదే
ఇక కేసీఆర్ ప్రకటనతో అన్ని పార్టీలూ కాస్త సైలెంట్ అవుతున్నాయి. దళిత బంధు స్కీమ్‌తో రాష్ట్రంలోని దళిత సామాజికవర్గం మొత్తం టీఆర్ఎస్ కు మద్దతు పలకడం ఖాయమనే చెప్పాలి. ఇక ఇలాంటి స్కీములతో ఇన్ని రోజులు దళితులపై ప్రేమ చూపిస్తున్నట్టు కామెంట్లు చేసే ప్రతిపక్షాలకు కొంత ఇబ్బంది ఏర్పడిది. దీంతో వారు కూడా ఈ స్కీముపై ఎలాటి కామెంట్లు చేయట్లేదు.
ఇక కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి కూడా కొత్త ప్లాన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అనే అంశాన్ని తెరమీదకు తెచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆ మేరకు రేవంత్ రెడ్డి కసరత్తులు కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కాంగ్రెస్‌లోని కీలక నేత అయిన దళిత సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహను ఇన్ చార్జిగా పెట్టడం కూడా సంచలనంగా మారింది. మరి ఈ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.