బిగ్ బాస్ బ్యూటీ కాళ్ళు పట్టుకున్న రామ్ గోపాల్ వర్మ !

చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ను అభిమానించే వారు ఎంతమంది ఉన్నారో.. ఈయనను తిట్టుకునే వారు కూడా అంతే మంది ఉన్నారు. వర్మ చేసే వ్యాఖ్యలు.. సినిమాలు అన్ని వివాదాస్పదంగా ఉంటాయి. అయితే… ఈ మధ్యలో కొంతమంది గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు ఆర్జివి.

ఇక ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ అరియన తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి రచ్చ చేశారు. ఇక తాజాగా అదే ఫార్మేట్ లో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వీడియోను రిలీజ్ చేయకముందే… ఓ హైప్ ను పెంచాడు వర్మ. ఇక ఇవాళ ఈ బోల్డ్ ఇంటర్వ్యూను విడుదల చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ మరియు ఏపీ పాలిటిక్స్ టాపిక్ కూడా వచ్చింది. అలాగే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వీళ్ళిద్దరూ ముచ్చటించారు.

ఈ నేపథ్యంలోనే… ఆశు రెడ్డి డ్రెస్ విషయాలను రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ లో అడుగుతాడు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్న నేపథ్యంలో… ఆమె కాళ్లు పట్టుకుంటాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో షాక్ తిన్న ఆశు రెడ్డి… ఏంటి సార్ అలా చేస్తున్నారు అని… అంటుంది. దీనికి సమాధానంగా… నువ్వు చాలా తెలివి గల.. అమ్మాయివి అంటూ ఆర్జివి మెచ్చుకుంటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=ygp3pWk5VsY