రాజమౌళి పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్న ఆర్జీవి.. కారణం..?

-

సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వర్మ ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఒకప్పటి వర్మ ఇప్పుడు లేరనే చెప్పాలి. ముఖ్యంగా శివ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ను తెరకెక్కించిన ఈయన ఇటీవల అన్నీ అడల్ట్ సినిమాలు చేస్తూ తన పరువు మొత్తం పోగొట్టుకున్నాడు అంతే కాదు ఈయన ఏం మాట్లాడినా సరే అది వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది.. ఇకపోతే షూటింగుల బంద్ గురించి ఆర్జీవి మాట్లాడుతూ బడ్జెట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఎందుకు వెళ్ళింది అనేది చాలామంది క్వశ్చన్ అంటూ ఆయన అన్నారు. ఇక హీరోయిన్ కు ఎనిమిది మంది స్టాఫ్ , మేకప్ మ్యాన్ లు, ఇతర విషయాలు సినిమాకు సంతకం చేసే ముందే నిర్మాతకు తెలుస్తాయి కదా అంటూ ఆయన ప్రశ్నిచడం గమనార్హం.ఉదాహరణకు బాహుబలి సినిమా తీస్తున్న సమయంలో శివగామి పాత్ర కోసం శ్రీదేవిని ఎంచుకున్నప్పుడు శ్రీదేవి తనతో పాటు చాలామంది వస్తారని డిమాండ్ చేసింది. కానీ అప్పుడు రాజమౌళి తన డిమాండ్లను తట్టుకోలేక వద్దని చెప్పుకొచ్చాడు. అదే రాజమౌళి గొప్పతనం అంటూ ఆర్జీవి ప్రశంసల వర్షం కురిపించాడు
అంతేకాదు సినిమాలలో నటీనటుల ఎంపిక విషయంలో ఇలాంటి డిమాండ్లు ముందే ఉంటాయని తెలుసుకున్న నిర్మాతలు ఎందుకు కరాకండిగా వారితో చెప్పడం లేదు అంటూ ప్రశ్నించాడు.అంతేకాదు రాజమౌళి ట్రాక్ రికార్డుకు శ్రీదేవి ఉన్నా లేకపోయినా సినిమా హిట్ అవుతుందని ఆయన తెలిపారు. ఇక డిమాండ్ ఎంత ఎక్కువ ఉంటే రేటు అంత పెరుగుతుందని చెప్పుకొచ్చిన వర్మ నిర్మాతలంతా ఒకే విధంగా ఆలోచించాలని అలా ఎందుకు ఆలోచించడం లేదు అంటూ వెల్లడించారు.

అంతేకాదు పెద్ద కెమెరామెన్ చిన్న సినిమా చేయడం చెప్పిన వర్మ.. ఆడియన్స్ టికెట్ ఎవరిని చూసి కొంటున్నారో.. వాళ్లకు అడిగినంత పారితోషికం ఇవ్వాల్సి ఉంటుందని కూడా వర్మ తెలిపారు . అంతేకాదు రాజమౌళిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news