బీజేపీది మహత్తర పాలనే అయితే..ఎన్ పీఏ 10 రెట్లు ఎందుకు పెరిగింది : కేసీఆర్

-

కొన్ని సంస్థలకు ఎన్పీఏల పేరిట రూ.12 లక్షల కోట్లు ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్పీఏలు రూ.2 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్లు పెరిగాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం మహత్తరమైన పాలన అందిస్తే ఎన్పీఏ తగ్గాల కానీ 10 రెట్లు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.

‘‘2004-05లో నాన్ పర్ఫామెన్స్ అసెట్స్ (ఎన్పీయే)లు రూ.58 వేల కోట్లు ఉండేవి.. ఇది 2014 నాటికి 2 లక్షల 63 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఇప్పుడు ఇది ఎంత ఉందో తెలుసా? 20 లక్షల 7 వేల కోట్ల రూపాయలు. ఎన్డీయే ప్రభుత్వంలో ఇదొక దందా అయిపోయింది. ప్రభుత్వ పెద్దలు, ఎన్పీయే వాళ్లు చేతులు కలిపి పెద్ద స్కాం చేస్తున్నారు. వాళ్లు ఎన్పీయే డిక్లేర్ చెయ్యగానే.. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చింది’’ అని కేసీఆర్ తెలియజేశారు.

“మేకిన్ ఇండియా, నీతి ఆయోగ్ మేధో సంపత్తి, మహత్తరమైన ప్రభుత్వ విధానాలు ఉంటే ఎన్పీయేలు తగ్గాలి కదా. వీళ్ల పాలనలో పది రెట్లు ఎలా పెరిగింది? ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం కాదా? అని ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో రుణ ఎగవేతలు కూడా లక్షల కోట్లకు చేరాయి. ఇది ప్రగతికి సంకేతమా? అని సూటిగా ప్రశ్నించారు. ‘‘మేకిన్ ఇండియా అని ప్రధాని చెప్తారు. కానీ గాలిపటాలు ఎగరేసే మాంజా నుంచి షేవింగ్ చేసుకునే బ్లేడ్లు, దీపావళి టపాసులు అన్నీ చైనా నుంచి వస్తున్నాయి. మేకిన్ ఇండియా అంటే ఇదేనా?’’   – కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి

“భారత్‌లో 83 కోట్ల ఎకరాలు ఉంటే.. దానిలో 40 కోట్లపైగా భూమి వ్యవసాయినికి అనుకూలమని, దానికి సరిపోయే నీరు కూడా నదుల ద్వారా లభిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇది ప్రపంచంలో మరే దేశానికీ లేని విలక్షణమైన లక్షణమని చెప్పిన ఆయన.. కానీ మన దేశం మాత్రం కంది పప్పు, పామాయిల్ వంటి నిత్యావసరాలను కూడా దిగుమతి చేసుకుంటోందని, ఇదేనా నీతి ఆయోగ్ సమర్థత? కేంద్ర ప్రభుత్వ బహుముఖ ప్రజ్ఞ ఇదేనా? “అని ప్రధాని మోదీపైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news