మెగా ఫ్యామిలీపై ఆర్జీవీ వివాదాస్ప‌ద ట్వీట్‌.. అందరూ పరాన్న జీవులే !

-

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఏదో ట్వీట్‌ చేసి… వార్తల్లో నిలుస్తుంటారు. అయితే… తాజాగా వర్మ మెగా ఫ్యామిలీ పై పడ్డారు. అల్లు అర్జున్‌ ఒక్కడే రియల్‌ మెగాస్టార్‌ అని.. పవన్‌ కళ్యాణ్‌- రామ్‌ చరణ్‌ సహా ఇతర మెగా హీరోలందరూ పరాన్న జీవులేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మెగా హీరోలంతా సెలబ్రేషన్స్‌ లో పాల్గొనడం… బన్నీ ఈ వేడుకల్లో హాజరు కాలేదని నేపథ్యం లో రామ్‌ గోపాల్‌ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

”శ్రీ మెగా చిరంజీవి మెగా సక్సెస్‌ వల్ల నిలబడిఇన వరుణ్‌ తేజ్‌ – సాయి ధరమ్‌ తేజ్‌, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, నిహారిక వంటి తక్కువ స్థాయి పరాన్న జీవులతో పోలిస్తే.. ఈ రోజు అల్లు అర్జున్‌ ఒక్కడే నిజమైన మెగాస్టార్‌. నేను వారిని పరాన్న జీవులు అని ఎందుకు పిలుస్తున్నానంటే వారందరూ చిరంజీవి ద్వారా మాత్రమే మనుగడ సాగిస్తున్నారు. కానీ అల్లు అర్జున్‌ ఎవరి మీద ఆధారపడలేదు.. కాబట్టి అతను మాత్రమే నిజమైన మెగాస్టార్‌ ” అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్‌ పెద్ద దుమారం రేపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news