బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ ముందంజ

-

బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ తొలి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు. కన్జర్వేటివ్ పార్టీలో తొలి రౌండ్ ఎన్నికల్లో రిషి సునాక్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. అయితే బ్రిటన్ ప్రధానమంత్రి పదవి రేసులో ఇద్దరు భారత సంతతి నేతలు నిలిచారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం రూపొందించిన తుది జాబితాలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి రుషి సునాక్, అటార్నీ జనరల్ సుయెలా బ్రావెర్మన్ చోటు దక్కింది. భారత సంతతికి చెందిన మరో కీలక నేత, హోంమంత్రి ప్రీతి పటేల్ మాత్రం తాను పోటీకి దూరమైనట్లు తెలుస్తోంది.

- Advertisement -
రిషి సునాక్
రిషి సునాక్

ప్రధాని పదవికి సునాక్, బ్రావెర్మన్ సహా మొత్తంగా ఎనిమిది మంది పోటీలో నిలిచారు. పాకిస్థాన్ సంతతికి చెందిన ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సాజిద్ జావిద్, రెహ్మాన్ చిస్తీ ప్రధాని పదవికి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ నామినేషన్‌కు అవసరమైన మద్దతు కూడబెట్టుకోలేకపోయారు. విదేశాంగ మంత్రి రిజ్ ట్రస్, ఆర్థిక శాఖ నూతన మంత్రి నదీమ్ జహావా, వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్ చివరి జాబితాలో నిలిచారు. ఈ నెల 21వ తేదీ వరకు పోటీలో ఇద్దరు అభ్యర్థులే మిగిలేలా తదుపరి రౌండ్లు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5వ తేదీన తుది ఎన్నిక జరగనుంది. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికైన వారు బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...