BREAKING : భద్రాచలానికి 3 వైపులా తెగిపోయిన రహదారులు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే… భద్రాచలానికి మూడు వైపులా రహదారులు తెగిపోయాయి. కొత్తగూడెం వైపు నుంచి మాత్రమే భద్రాచలానికి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది.

65 అడుగులు దాటితే కొత్తగూడెం లింకు రోడ్డు కూడా తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక అటు భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం ప్రవహిస్తుంది. ఎగువ నుంచి అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద వస్తుంది.

ఈ వరదతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58. 10 అడుగుల వద్ద ఉన్నది. పై నుంచి శ్రీ రామ్ సాగర్, కాలేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాలలో కూడా ప్రమాదకర స్థాయిలో దాటి వర్షాలు వస్తున్నాయి. దీంతో భద్రాచలంకు 20 లక్షల క్యూసెక్కుల పైగా వరద నీరు వస్తుందని అధికారులు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news