రష్యా-ఉక్రెయిన్ వార్ : హైదరాబాద్, వరంగల్ లో భారీగా పెరిగిన పెట్రోల్, బంగారం ధరలు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్రంగా యుద్ధం సాగుతోంది. రష్యా ఏకపక్షంగా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటూ పోతోంది. ఈ రోజు ఉదయమే మొదలైన యుద్ధం… ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనులు కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు రష్యాని నిలరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి రష్యాను యుద్ధం ఆపేయాలని కోరింది.

అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు శాపంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ అలాగే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక మన దేశంలో లో మీ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మన తెలంగాణ విషయానికి వస్తే చాలాచోట్ల పెట్రోల్ రేట్ లతోపాటు, బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో బంగారం, వెండి ధరలు ఎలా పెరిగాయో ఇప్పుడు చూద్దాం.

బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 930 పెరిగి రూ. 51,110 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 850 పెరిగి రూ. 46,850 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.600 పెరిగి రూ. 70,600 గా నమోదు అయింది.

వరంగల్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1010 పెరిగి రూ. 50750 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 808 పెరిగి రూ. 40600 గా ప‌లుకుతుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 గా నమోదు కాగా లీటర్ డీజిల్ ధర రూ.94.62 గా నమోదు అయింది.

అలాగే వరంగల్ జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి…రూ.107.88 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 17 పైసలు పెరిగి… రూ.94.31 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news