ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి హౌస్ అరెస్ట్‌..!

-

అస్సాం సీఎం పై కేసు న‌మోదు చేయాల‌ని ఎస్పీ కార్యాల‌యాల ముట్ట‌డికి కాంగ్రెస్ పిలుపు మేర‌కు జ‌గిత్యాల జిల్లా కాంగ్రెస్ నేత‌ల‌ను ముంద‌స్తు అరెస్ట్ చేసి ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌కు త‌ర‌లించారు. ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ్యాంగం మార్పు కావాలంటూ కోరారు. కేసీఆర్ రాజ్యాంగం మార్పు ఏవిధంగా ఉంటుందో ఈ అక్ర‌మ అరెస్టులు దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి భార‌త పౌరునికి త‌న అభిప్రాయం వ్య‌క్తం చేసే హ‌క్కు ఉంటుంద‌ని జీవన్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.


అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ దేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి బాధ్యతారహితంగా దేశంలో అశాంతి నెలకొల్పే విధంగా మాట్లాడారు. అస్సాం ముఖ్య‌మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు జీవ‌న్‌రెడ్డి. ఇప్ప‌టికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమ‌టి వెంక‌ట్‌రెడ్డి, ష‌బీర్ అలీ వంటి నేత‌ల‌ను అరెస్ట్ హౌస్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news