జగన్ పిలుపుకి తన జీవితం మొత్తం జీతాన్ని ఇస్తున్న వైసీపి ఎమ్మెల్యే

-

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఎంత పాపుల‌ర్ అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చంద్ర‌బాబు త‌న‌యుడు, పార్టీకి ఫ్యూచ‌ర్ లీడ‌ర్ అని అంద‌రి దృష్టిలో ఉన్న టీడీపీ యువ‌నేత‌, అప్ప‌టి మంత్రి నారా లోకేశ్‌ను ఓడించి సంచ‌ల‌నం రేపాడు. మంగ‌ళ‌గిరి నుంచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలుస్తోన్న ఆర్కే పార్టీ అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఎన్నో సంచ‌నాల‌తో వార్త‌ల్లో ఉంటున్నారు.

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి ఇస్తామని స్వయంగా జగన్ హామీ కూడా ఇచ్చారు.. కానీ సామాజిక సమీకరణాలతో దక్కలేదు. అయినా ఆర్కే మాత్రం తాను న‌మ్మిన పొలంలో వ్య‌వ‌సాయం చేసుకుంటూ ఎమ్మెల్యేగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేస‌కుంటూ కాలం గ‌డుపుతున్నారు.

ఇప్ప‌ట‌కీ ఆయ‌న త‌న పొలంలో సీజ‌న్ల‌ను బ‌ట్టి పంట‌లు సాగు చేస్తుంటారు. ఎడ్లబండి సాయంతో తన పొలానికి వెళుతూ.. వ్యవసాయానికి కావాల్సిన అన్నింటిని సమకూర్చుకుంటున్నారు. మంగ‌ళ‌గిరిలో కేవ‌లం ఐదు రూపాయిల‌కే అన్నం ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. తాజాగా ఆయ‌న ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పిలుపు మేర‌కు జీవితాంతం త‌న‌కు వ‌చ్చే జీతాన్ని కనెక్ట్ టూ ఆంధ్ర కార్యక్రమానికి విరాళంగా ప్రకటించారు. ఆర్కే సీఎం పిలుపు మేర‌కు స్పందించి త‌న జీవితం మొత్తం విరాళంగా ఇవ్వ‌డంతో ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు వ్య‌క్త మ‌వుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news