శివం.. అంటేనే మంగళకరం. సర్వశుభాలను కలిగించే పరమాత్ముడు మహాదేవుడు. ఆయన అభిషేక ప్రియుడు. ఆయనకు అభిషేకం చేస్తే లోకాలు అన్ని చల్లగా ఉంటాయి. ఊర్లో శివలింగం చల్లగా ఉంటే ఊరంతా చల్లగా అంటే శాంతిసౌఖ్యాలతో ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. అటువంట పరమశివుడికి ఆయా పదార్థాలతో అభిషేకం చేస్తే వచ్చే ఫలాలను తెలుసుకుందాం. ఏయే పదార్థాలతో అభిషేకం చేస్తే ఈ ఫలం వస్తుందో తెలుసకుందాం…
*ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగును
*మారేడు బిల్వదళ జలముతో చేత అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించును
*గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు.
*ఆవు పాల అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములు లభించును
*నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యువు నశించగలదు.
*రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములను పొందవచ్చు.
*కస్తూరి కలిపినా నీటిచే అభిషేకం చేసిన కీర్తి వస్తుంది.
*పసుపు నీటితో అభిషేకం జరిపితే మంగళ ప్రదము జరుగును, శుభకార్యాలు తొందరగా జరుగును.
*పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము పొందవచ్చు.
*చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనం కలుగుతుంది.
*పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగుతుంది.
*ఇవేకాకుండా భస్మజలం, గంగాజలం, గంధోదకం తదితర పదార్థాలతో అభిషేకం చేస్తే విశేష ఫలితాలు *వస్తాయి.
*ఈ పవిత్ర కార్తీకమాసంలో అభిషేకాలు చేస్తే ఫలితం రెట్టింపు వస్తుంది. శ్రవణం, కీర్తనం, భక్తి, శ్రద్ధతో చేసే పూజలు మాత్రమే సత్ఫలతాన్నిస్తాయి అనే విషయాన్ని మరువద్దు.
– కేశవ