పంజాబ్లో బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలినడకన వెళ్తున్న యాత్రికులపైకి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది యాత్రికులు దుర్మరణం చెందారు. అనేక మంది గాయపడ్డారు. హోషియార్పుర్ జిల్లా గర్శంకర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందిసమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బైశాఖీ పర్వదిన వేడుకల్లో పాల్గొనేందుకు సుమారు 50 మంది భక్తులు చరణ్ ఛో గంగా వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వారిని ఢీకొట్టిందని జరిగందని గర్శంకర్ డీఎస్పీ దల్జిత్ సింగ్ ఖాఖ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని.. వీరంతా ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలోని మస్తాన్ ఖేరా ప్రాంతానికి చెందినవారిగా గుర్తించామని చెప్పారు.
ఘటన జరిగిన స్థలం పర్వత ప్రాంతం కావడం వల్ల లారీ డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.