తిరుమల కొండపై కారు ప్రమాదం..ఒకరు మృతి

-

తిరుమల ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల మొదటి కనుమదారిలో.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తిరుపతి చేరుకునేందుకు మరో మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా.. జరిగిన ఈ దుర్ఘటన లో శివలింగం అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.

ఇంకా ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో వ్యక్తి పరిస్థితి చాలా విషమంగా …. ఉందని సమాచారం అందుతోంది. కారు అదుపు తప్పి రైలింగ్ న్యూడ్ ఢీకొట్టడంతో నే ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తులను వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రమాదానికి గురైన వారు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news