టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. దేశం, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. తనకు క్రికెట్ కెరీర్ లో మద్దతు అందించినందుకు తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ సుదీర్ఘమైన నోట్ రాసి తన రిటైర్మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఉతప్ప తెలిపాడు.
ఈ పరిణామాల నడుమ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను గతంలో క్లినికల్ డీప్రెషన్ కు గురయ్యానని ఎందుకలా డిప్రెషన్ ఎదుర్కొన్నానో కూడా తెలియదంటూ పేర్కొన్నాడు. 2009 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పాడు. ‘నేను 2009లో క్లినికల్ డీప్రెషన్ తో బాధపడ్డాను. నాకు ఎందుకలా జరిగిందో కూడా తెలియదు. 2009 ఐపిఎల్ టైం లో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఊతప్ప ప్రముఖ మీడియాతో షాకింగ్ విషయాలు బయట పెట్టాడు.