టీమిండియా కెప్టెన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస పెట్టి సిరీస్ లను గెలుస్తుపోతున్నాడు. గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ తో టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ వరుసగా సిరీస్ లు గెలుచుకుంటూ పోతున్నాడు.
విండీస్, శ్రీలంక జట్ల జరిగే మ్యాచ్ ల్లోనూ దుమ్ముదులిపాడు. ఇక ఈ నేపథ్యంలోనే.. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ కొత్త కారును కొనుగోలు చేశాడు. ఇటలీ కి చెందిన ఓ ప్రఖుఖ కంపెనీ బ్రాండ్ కారును చేర్చుకున్నాడు.
అత్యంత ఖరీదైన లంబోర్గినీ ఉరుస్ ఎస్యూవీ కారును కొన్నాడు. పర్సనలైజ్డ్ ఇంటీరియల్స్ ఉన్న ఈ కారు విలువ ఏకంగా రూ.3.10 కోట్లు. ఈ విషయాన్ని ఆ కారు షోరూం కంపెనీ అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. దీంతో దేశంలో ఆ ఖరీదైన కారు కొన్న అరుదైన ప్రముఖుల జాబితాలో రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. కాగా.. అచ్చం ఇదే కారును గతంలో టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.