ఈరోజుల్లో ఒబిసిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. పదిలో ఆరుగురు స్తూలకాయంతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్యకారణం..కొవ్వులు ఉన్న ఆహారం ఎక్కువగా తినటం, వ్యాయామాలు చేయకపోవడం. స్థూలకాయం అనేది సకలరోగాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఎన్నోఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి నీతి ఆయోగ్(Niti Aayog) వార్షిక నివేదిక ప్రకారం, జనాభాలో పెరుగుతున్న స్థూలకాయాన్ని పరిష్కరించడానికి చక్కెర, కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ఆహార పదార్థాలపై పన్ను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
జనాభాలో పెరుగుతున్న ఊబకాయాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో వార్షిక నివేదిక 2021-22 పేర్కొంది. దేశంలో పిల్లలు, యుక్తవయస్కులు, మహిళల్లో అధిక బరువు, ఊబకాయం పెరుగుతున్నట్లు ఆయోగ్ నివేదికలో తెలిపింది.
“నీతి ఆయోగ్, IEG, PHFI సహకారంతో దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తుంది. అంటే HFSS ఆహారాల ఫ్రంట్-ఆఫ్-ప్యాక్ లేబులింగ్, మార్కెటింగ్, కొవ్వులు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలపై పన్ను విధించడం వంటి చర్యలకు నాంది పలకింది. నాన్-బ్రాండెడ్ నామ్‌కీన్‌లు, భుజియాలు, వెజిటబుల్ చిప్స్, స్నాక్ ఫుడ్స్‌పై 5 శాతం జీఎస్‌టీ, బ్రాండెడ్, ప్యాక్ చేసిన వస్తువులపై 12 శాతం జీఎస్‌టీ విధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) 2019-20 ప్రకారం, 2015-16లో ఊబకాయం ఉన్న మహిళల శాతం 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరిగింది. అయితే పురుషుల శాతం 18.4 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగిందట.
ఊబకాయం పురుషుల కంటే మహిళలనే ఎక్కువ వేధిస్తుంది. అసలే ఆడవారికి అందంమీద శ్రద్ద ఉంటుంది. తమ చేతుల్లో లేకుండానే బరువు పెరిగిపోవడం..నలుగురిలో వారిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. అంతేకాదు..అధికబరువున్న స్త్రీలకు పిరియడ్స్ సమస్య ఉంటుంది. ఓవరీస్ లో బుడగలు వస్తాయి..పెళ్లైనా గర్భం దాల్చలేరు. ఒబిసిటీ ఒక సమస్య అంటే..ఇంకా ఇవన్నీ బోనస్ గా వస్తాయి. కాబట్టి బరువుపెరగడాన్ని స్త్రీలు ఏమాత్రం అశ్రద్ధ చేసుకోవద్దు. తిండిమీద కంట్రోల్, వ్యాయామం మీద పట్టు పెంచుకుంటే..పెరిగిన కాలరీను తరిగించుకోవచ్చు.
-Triveni Buskarowthu