వైయస్సార్ రెండు అడుగులు వేస్తే.. జగన్ నాలుగు అడుగులు వేస్తారు : రోజా

టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. నారా చంద్రబాబు కు వయస్సు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటి కైనా ప్రతిపక్ష నేత గా హుందాగా వ్యవహారిస్తే కనీస గౌరవం దక్కుతుందని చురకలు అంటించారు రోజా. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి రెండు అడుగులు ముందుకు వేస్తే.. ఏపీ సిఎం జగన్ 4 అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు ఎమ్యెల్యే రోజా.

సిఎం జగన్ పాలనపై ప్రతి పక్షాలకు పిచ్చి ఎక్కి విమర్శలు చేస్తున్నాయని అగ్రహించారు. ఓటిఎస్ పేద ప్రజలకు ఓ వరమన్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా 14 మందికి ఇళ్లపై హక్కు కల్పించ లేకపోయారని అగ్రహించారు రోజా. రిజిస్ట్రేషన్ తోపాటు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని అమలు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. డబ్బులు కట్టవద్దని అంటున్నారే తప్ప ఓటిఎస్ ను ఎవరు వ్యతిరేకించడంలేదని నిప్పులు చెరిగారు రోజా.