ఏపీకి అన్యాయం జరిగితే జగన్ సహించరు: రోజా

-

తిరుపతి: శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేయాలనుకుంటే సీఎం జగన్ సహించరని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న జలవివాదాలపై స్పందించారు. రోజూ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నామన్నారు. నీటిని విద్యుత్ తయారీకి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అన్యాయం చేయొద్దన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వివాదం విషయంలో…కేంద్ర జలవనరుల శాఖ మంత్రి జోక్యం చేసుకుని ప్రాంతీయ విధ్వేషాలు ఏర్పడకుండా చూడాలన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటా ఇవ్వకుండా అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని రోజా హెచ్చరించారు.

కాగా కొన్ని రోజులుగా నీటి వాడకం విషయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో సీఎం జగన్..కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news