ఏపీ మంత్రివర్గంలో వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు దక్కకపోయినా ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవిని జగన్ ఇచ్చారు. దీంతో ఆమె ఇవాళ ఆ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడంతో ఆ పార్టీకి చెందిన కీలక నేత రోజాకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా అనుకున్నారు. రోజాకు సీఎం జగన్ హోం మంత్రి లేదా స్పీకర్ పదవుల్లో ఏదో ఒకటి ఇస్తారని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమె ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఆ తరువాత జగన్ రోజాను పిలిపించి ఆమెతో మాట్లాడి ఆమెకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో రోజా మెత్తబడ్డారు. అయితే ఎట్టకేలకు ఆమె ఆ పదవిలో ఇవాళ బాధ్యతలను స్వీకరించారు.
ఏపీ మంత్రివర్గంలో వైకాపా నేత, నగరి ఎమ్మెల్యే రోజాకు చోటు దక్కకపోయినా ఆమెకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవిని జగన్ ఇచ్చారు. దీంతో ఆమె ఇవాళ ఆ పదవీ బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరిలోని ఆటోనగర్‌లో ఉన్న ఏపీఐఐసీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రోజా తన చాంబర్‌లో ప్రత్యేక పూజు చేయించి బాధ్యతలు చేపట్టారు. కాగా జూన్ నెలలోనే రోజాకు ఈ పదవి ఖాయమైనా ఇప్పటి వరకు ఆమె మంచి రోజులు లేవని బాధ్యతలను స్వీకరించలేదు.
అయితే రోజాకు జూన్ నెలలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఖాయమైనా ఈ నెల 10వ తేదీనే అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఆమె ఇవాళ ఆ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ క్రమంలో ఆమె మరో 2 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. అయితే ఈ పదవిలో రోజా ముందు ముందు ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారన్నది ఆసక్తికరంగా మారింది..!