రొమాంటిక్ ఫిగర్ కొత్త దారి అయినా హిట్ తెస్తుందా.!

-

గతంలో రొమాంటిక్ యూత్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన  అల్లు శిరీష్ మరియు అను ఇమ్మాన్యూయేల్ సినిమా ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ అందుకోలేక బోల్తాపడింది.  ఈ సినిమా కోసం ప్రమోషన్స్ అన్నీ ఒక రేంజ్ లో చేసినా కూడా సినిమా గట్టెక్క లేక పోయింది. ఈ సినిమా పై  ఇమ్మాన్యూయేల్ పెట్టుకున్న ఆశలు మొత్తం ఆవిరయ్యాయి 

గతంలో అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ రాగానే ఆమె చాలా సంతోష పడింది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా కావడంతో తన కెరియర్ కు బూస్ట్ అవుతుంది అని చాలా ఊహించుకుంటూ కాలం గడిపింది. తీరా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. తీరా అల్లు అర్జున్ అన్నా హిట్ ఇస్తాడు అనుకుంటే అదికూడా ప్లాప్ అయ్యింది. ఇక తర్వాత వచ్చిన సినిమాలు ఏవి అమ్మడిని పైకి తీసుకొని రాలేదు. ఇప్పుడు ఊర్వశివో రాక్షసివో కూడా ప్లాప్ అయ్యింది.

దీనితో అమ్మడు కోలీవుడ్ బాట పట్టింది.ఇప్పుడు అను ఇమ్మాన్యూయేల్ ఆశలన్నీ కూడా కార్తీ తో జోడీగా నటిస్తున్న జపాన్ అనే సినిమా పైనే ఉన్నాయి.ఊర్వశివో రాక్షసివో కోసం ఎంత గ్లామర్ వలక బోసినా, ఎంతగా హాట్ హాట్ సన్నివేశాల లో సిగ్గు పడకుండా నటిస్తున్నా కూడా హిట్ అనేది ఎండ మావిగా మారింది. వాస్తవానికి అను ఏమి తీసి పారేసే ఫిగెర్ కాదు కాని మంచి హిట్ మాత్రం తన ఖాతాలోకి రావటం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news