గులాబీల దినోత్సవం.. మీరు ప్రేమించిన వారికి ఏ రకం గులాబీ ఇవ్వాలో తెలుసా..?

-

ఆల్రెడీ ప్రేమ మైకం కమ్మే నెలలోకి వచ్చేసాం. అప్పుడే మంచు మెల్ల మెల్లగా కురవడం తగ్గిస్తుంటే ప్రేమ కురవడం మొదలవుతున్నట్టు ఫిబ్రవరిలోకి వచ్చేసాం. ప్రేమికుల రోజుకి మరో వారం రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సంబరాలు వారం ముందే మొదలయ్యాయి. తాము ప్రేమించిన వారికి గులాబీలని ఇస్తూ తమ ప్రేమని వ్యక్తం చేసే రోజుని గులాబీల దినోత్సవంగా జరుపుకుంటారు. గులాబీల్లో ఎన్నో రకాలున్నాయి. అందులో నుండి ఎలాంటి రకం గులాబీ ఇస్తే బాగుంటుందో చూద్దాం.

ఎర్ర గులాబీ

స్వఛ్ఛమైన ప్రేమకి నిదర్శనం. ఈ గులాబీ ఇచ్చేవారు నువ్వు నేను ఒకటే అన్న భావాన్ని అవతలి వారికి తెలియజేయాలన్న కాంక్షతో ఉంటారు. అలాంటి కాంక్ష మీకూ ఉంటే మీరు ప్రేమించినవారికి ఎర్రగులాబీ ఇవ్వండీ.

పసుపు పచ్చ గులాబీ

పసుపు రంగులో ఉన్న గులాబీ ఇస్తుంటే మీరు మీ ప్రేయసిని చాలా కేరింగ్ గా చూసుకుంటారని సింబాలిక్ గా చెబుతున్నట్టు లెక్క. స్నేహానికీ, కేరింగ్ కీ పసుపు గులాబీ చిహ్నంగా ఉంటుంది.

నారింజ రంగు గులాబీ

మీరు ప్రేమించిన వారి మీద బలమైన ప్రేమని తెలియజేయాలనుకుంటే నారింజ రంగు గులాబీని ఇవ్వండి. అవతలి వారి మీద మీకు గట్టి ఫీలింగ్ ఉంటే నారింజ రంగు గులాబీ ఇవ్వడం బెటర్.

గులాబీ రంగు గులాబీ పువ్వులు

ఇవి విశ్వాసానికి, ఉత్సాహానికి ప్రతీక. మీలో ఆనందాన్ని అవతలి వారికి తెలియజేయడానికి, అవతలొ మీద మీ విశ్వాసాన్ని తెలియజేయడానికి బాగుంటాయి.

తెల్ల గులాబీలు

స్వచ్చతకి, అమాయకత్వానికి వైట్ రోజెస్ చిహ్నంగా పనిచేస్తాయి. అందుకే పెళ్ళిళ్ళలో అంత్యక్రియల్లో వాడుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news