BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన రాస్ టేలర్

-

న్యూజిలాండ్ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రాస్ టేలర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ తాజాగా రాస్ టేలర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాస్ టేలర్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఈ వేసవి ముగింపులో తన స్వదేశమైన న్యూజిలాండ్ దేశంలో జరిగే మ్యాచులు తన కెరీర్లో చివరి ఉన్నాయని రాష్ట్ర ప్రకటన చేశారు.

ఈ వేసవి ముగింపులో.. బంగ్లాదేశ్ లో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లులు.. ఆస్ట్రేలియా, నెదర్లాండ్ తో జరిగే ఆరు వన్డే మ్యాచ్ తన కెరీర్లో చివరి కానున్నాయని వెల్లడించారు టైలర్. తన 17 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు రాస్ టైలర్. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవలే.. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, ఎబి డివిలియర్స్ తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news