ఏబీడి సిక్స్ ల వర్షం.. సునాయాసంగా గెలిచిన ఆర్సీబీ

ఐపీఎల్ 2020 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ సునాయాసంగా గెలిచేసింది. పవర్ హిట్టర్ ఏబీ డివిలియర్స్ సంచలన ఇన్నింగ్స్‌ తో ఒంటిచేత్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ని గెలిపించాడు. రాజస్థాన్ రాయల్స్‌ తో ఈరోజు ఆడిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 22 బంతుల్లో 1×4, 6×6) ఒంటిచేత్తో గెలిపించాడు.

చెలరేగి ఆడడంతో 178 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో బెంగళూరు గెలిచింది. ఈ సీజన్‌ లో ఈరోజు జరిగిన మ్యాచ్ 9వది కాగా బెంగళూరుకి ఇది ఆరో విజయం. అయితే విచిత్రంగా రాజస్థాన్‌కి ఇది ఆరో ఓటమి. ఏకంగా ఆరు సిక్స్ లు ఒక ఫోర్ కొట్టిన ఏబీ డివిలియర్స్ ఒంటిచేత్తో గెలిపించాడని చెప్పచ్చు.