IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. జట్ల వివరాలు ఇవే

ఐపీఎల్ 2021 రెండో సీజన్ చివరి దశకు వచ్చింది. లీగ్ మ్యాచ్ లలో భాగంగా ఇవాళ… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయిలోని ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతోంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు సంబంధించిన ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ ఎలెవన్): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడికల్, శ్రీకర్ భారత్ (డబ్ల్యూ), డేనియల్ క్రిస్టియన్, గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, జార్జ్ గార్టన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (w/c), రిపాల్ పటేల్, షిమ్రాన్ హెట్‌మియర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్త్జే