IPL RR vs GT : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్

-

ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు 24 వ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో భాగంగా కీల‌క‌మైన టాస్ ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్ గెలిచింది. దీంతో ముంద‌గా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీంతో తొలుత గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ రెండు జ‌ట్లు కూడా స‌మానామైన పాయింట్ల‌తో ఉన్నాయి. కానీ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ లో ఉంది.

గుజ‌రాత్ టైటాన్స్ నెట్ ర‌న్ రేట్ త‌క్కువ నేప‌థ్యంలో ఐదో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ గెలిచి డైరెక్ట్ గా అగ్ర స్థానాకి చేరుకోవాల‌ని కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్ర‌ణాళికలు రాస్తున్నాడు. అలాగే అగ్ర స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోవాలని రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ ప్లాన్ వేస్తున్నాడు. ఈ స‌మ ఉజ్జీల మ్యాచ్ లో గెలుపు ఎవ‌రిదో చూడాలి మ‌రి.

ఈ మ్యాచ్ లో ఆడ‌బోయే తుది జ‌ట్లు ఇవే..
రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు
జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ / వికెట్ కీప‌ర్ ), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, షిమ్రాన్ హెట్మెయర్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ తుది జ‌ట్టు :
మాథ్యూ వేడ్ ( వికెట్ కీపర్ ), శుభమన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, యశ్ దయాల్

Read more RELATED
Recommended to you

Latest news