RRR: జపాన్ లో మెప్పించలేకపోతోందా..?

-

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టార్రర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏ సినిమా సొంతం చేసుకోలేని రికార్డులను సైతం కొల్లగొట్టింది. పెట్టిన పెట్టుబడికి సినిమా నిర్మాతలకి అయితే భారీ స్థాయిలో లాభం అయితే అందించింది. మొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాకు అన్ని భాషల నుంచి కూడా మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు రాజమౌళి కూడా తన స్థాయిని పెంచుకున్నాడు. అయితే ఈ సినిమాకు విదేశీ సినిమా ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన లభించడమే గమనార్హం.

ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో మంచి క్రేజ్ అందుకున్న ఈ సినిమా జపాన్ లో కూడా విడుదల చేశారు. నిజానికీ జపాన్ లో ఇండియన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కాబట్టి అక్కడ కూడా రెగ్యులర్ సినిమా తరహానే తెలుగు సినిమాలను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రణాళికలు చేసింది. అంతేకాకుండా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముగ్గురూ కూడా తమ ఫ్యామిలీలతో కలిసి అక్కడ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడమే కాకుండా జపాన్ ఆడియన్స్ తో ప్రీ రిలీజ్ మూవీ వీక్షించడంతో ఈ సినిమాకు భారీ బజ్ ఏర్పడింది.కానీ విడుదలైన నాలుగు రోజుల్లోనే జపాన్ మార్కెట్లో రూ.2కోట్ల షేర్ కలెక్షన్ మాత్రమే సాధించింది.

అంచనాలకు తగ్గట్టుగా మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను సాధించలేదు. కానీ చూసిన వారు మాత్రం చిత్ర యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. జపాన్లో ఎక్కడికి వెళ్ళినా సరే వీరికి మంచి సపోర్టు లభిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా జపాన్లో మాత్రం కలెక్షన్లను రాబట్టలేక పోతోంది. కనీసం మునుముందు అయినా ఈ సినిమా మళ్లీ విజయాన్ని అందుకుంటుందేమో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news