“ఊర్వశివో రాక్షసివో” కోసం రంగంలోకి బాలయ్య

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో… అల్లు శిరీష్ కు “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్ – విరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌ లోని జేఆర్సీ కన్వేన్షన్‌ లో “ఊర్వశివో రాక్షసివో” ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే… ఈ ఈవెంట్‌ కు నందమూరి బాలయ్య గెస్ట్‌ గా రానున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news