ట్రిపుల్ ఆర్ ట్విట్టర్ లో అడ్డంగా దొరికిపోయాడంటున్నారు!!

-

అధికార వైఎస్సార్సీపీ కి గతకొన్ని రోజులుగా భారీ తలనొప్పిగా తయారయ్యారు రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనడంలో ఎవరికీ సందేహం ఉండకపోవచ్చు. వైకాపాతో ఇష్టం లేని కాపురం చేస్తున్నాడన్న సంకేతాలు ఇప్పటికే చాలాసార్లు ఇచ్చిన ఆయన… అన్నింటికంటే ఎక్కువగా, తాను చాలా బలమైనదిభావించిన “వైఎస్సార్సీపీ – యుశ్రారైకా” లాజిక్ విషయంలో ప్రస్తుతం అడ్డంగా దొరికిపోయాడని అంటున్నారు నెటిజన్లు!

తాజాగా ట్విట్టర్ వేదికగా ఒక ఫోటో, రెండు పేజీల లేఖలను పోస్ట్ చేసి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తనకున్న ప్రేమ, గౌరవం ఇది అంటూ ప్రదర్శించారు రఘురామకృష్ణంరాజు. ఈ సందర్భంలో ఆయన ప్రొఫైల్ లో “మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (లోక్ సభ) ఫ్రం ఆంధ్రప్రదేశ్ – వై.ఎస్.ఆర్.సీ.పీ. అని రాసుకున్నారు! సరిగ్గా ఇక్కడే దొరికేశారు అని అంటున్నారు నెటిజన్లు!

టీవీ డిబేట్లల నుంచి మొదలు, లోక్ సభ స్పీకర్ కి, ఎన్నికల కమిషన్ కి ఇచ్చిన ఫిర్యాదుల వరకూ… తనంకు బీ-ఫారం ఇచ్చింది “యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ” అని, కాని తనకు షోకాజ్ నోటీసు వచ్చింది “వై.ఎస్.ఆర్.సీ.పీ.” నుంచి అని ఫిర్యాదు చేసిన ఆయన.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో మాత్రం “తాను వైఎస్సార్ సీపీ నుంచి ఎంపికైన ఎంపీ”గా పొందుపరిచడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఆయనే చెప్పాలని అంటున్నారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు.

ఇష్టం లేని కాపురానికి పెట్టే వంకలే ఇవన్నీ అని.. ఆయనకు పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే.. పార్టీ నుంచి వచ్చిన ఎంపీ పదవికి రాజినామా చేసేసి.. తనకు నచ్చిన పార్టీ నుంచి పోటీ చేసుకోవచ్చు కదా అని సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news