ఆర్ఆర్ఆర్ : ఔర్ ఏక్ ఫ్లెక్సీ ఆగ‌యా ! రెండు క‌ళ్లూ చాల‌వు భ‌య్యా !

-

ఒక్క సినిమా భార‌తీయ సినిమా స‌రిహ‌ద్దులు దాటి చెరిపి మ‌న‌దైన సినిమా అదిగో మ‌న సినిమా ఆర్ఆర్ఆర్.. తెర‌పై కాంతులు ఫ్లెక్సీల‌లో ఆనందాలు. అగ్ర తారలు అంతా కొలువు దీరిన ఫ్లెక్సీలు..దారంతా అభిమానుల ఆనందాలు రెండు క‌ళ్లూ చాల‌వు.. అవును! బీయాండ్ ద లైఫ్ బియాండ్ ద ఫిల్మ్ .. ఎవరుంటారు.. ఎవ‌రు తోడు వ‌స్తారు.. అదిగో ఆర్ఆర్ఆర్.. తెలుగు వాడి పొగ‌రు..తెలుగు వాడి గౌర‌వం మ‌రియు రాజ‌సం కూడా! మ‌న తోటి క‌న్న‌డ తీరాల‌లో..

మాట్లాడే క‌ళ్లు .. వేటాడే చూపులు.. అటు చిరు ఇటు చిరుత..అటు బాలయ్య ఇటు తార‌క్.. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు అంద‌రు అగ్ర తార‌లూ సంద‌డి చేసే పోస్ట‌ర్.. ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్ లో ఉన్నాడ‌క్క‌డ.. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ న‌వ్వులు చిందిస్తూ.. ఆల్ ద బెస్ట్ చెబుతున్నాడు అక్క‌డ.. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు తారాలోకం అంతా అక్కడే ఉంది. అఖండ విజ‌యం అందుకోనుంది ఆర్ఆర్ఆర్. క‌న్న‌డ నాట ఆర్ఆర్ఆర్..బెంగ‌ళూరు దారుల్లో ఆర్ఆర్ఆర్…

బాబాయ్ అంటే ప్రేమ.. బాబాయ్ దీవెన‌లు అందుకుని ముందుకు వెళ్తున్నాడు తార‌క్. బాబాయ్ అంటే గొప్ప అభిమానం ఆయ‌న ఓ తండ్రి త‌రువాత తండ్రి.. ఆ స్థానంలో ఆ రాముడ్ని తలుస్తూ రాముడు.. మ‌న తార‌క రాముడు. కొమురం భీముడు. తండాల తెగువ చాటేందుకు వ‌స్తున్నాడు. అదిగో మ‌న్యం వీరుడు రాముడు మామూలు రాముడు కాదు సీతా రాముడు.అడ‌వి బాట‌లో విప్ల‌వ తేజం అది.. పండు వెన్నెల‌లో కొత్త కాంతి ధార అది. విప్లవ సూరీడు మోసుకువ‌స్తున్న చైత‌న్య గీతం ఇది.. ఒక‌టి కాదు రెండు.. ఒక్క‌రే ఆ ఇద్ద‌రూ.. అవును సిద్ధంగా ఉండండి ఆర్ఆర్ఆర్ వ‌స్తుంది.

అభిమానుల‌కు పండుగ.. ప్ర‌తి ఫ్లెక్సీ ఓ విజువ‌ల్ ఫీస్ట్..పోస్ట‌ర్ లో భారీ త‌నం…సినిమాలో భార‌తీయం. న‌డ‌వ‌డిలో విప్ల‌వ గుణం.. ఆచ‌ర‌ణ‌లో ఆద‌ర్శం..అన్నీ క‌లిస్తే అదిగో ఆ అభిమాన గ‌ణం. వ‌స్తున్న‌దదిగో ఆర్ఆర్ఆర్.. గ్రాడ్ వెల్కం టు ఆర్ఆర్ఆర్..వీరుడా స్వాగ‌తం వీరులారా వంద‌నం జై రాముడు జై భీముడు జై తారక్ జై చ‌ర‌ణ్.. జై ఆర్ఆర్ఆర్ టీం ….

చ‌ర‌ణ్ కోసం అభిమానులు మ‌రింత సిద్ధం అవుతున్నారు. మెగాస్టార్ అందించిన మ‌రో స్టార్.. అతడు చిరు ఇత‌డు చిరుత అని అంటారంతా! నాన్న కన్నా మంచి పేరు తెచ్చుకోవాలన్న తాప‌త్ర‌యం.. మంచి సినిమాల‌తో న‌టుడిగా ఎదగాల‌న్న త‌ప‌న.. అన్నీ క‌లిసి మ‌న‌కు అల్లూరి సీతారాముడిగా క‌నిపించ‌నున్నారు మ‌న మ‌గ‌ధీరుడు. నాన్న దీవెన‌లు బాబాయ్ అండ‌దండలు క‌లిస్తే మెగా దండుకు తిరుగేముంది. ఎదురేముంది.. గ్రాండ్ వెల్కం టు చ‌ర‌ణ్ .. గ్రాండ్ వెల్కం టు రామ్ చ‌ర‌ణ్ తేజ్..

– మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news