ట్రెండ్ ఇన్ : ధ‌ర‌ల ద‌రువులో తీన్మార్ ఆడుతున్నారు..? ఓవ‌ర్ టు మోడీ..

-

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌రువాత సీన్ మారిపోయింది
ధ‌ర‌లు మారిపోయాయి అదేవిధంగా మోడీ కూడా మారిపోయారు
ఇచ్చిన మాట త‌ప్పిన కేంద్రం సామాన్యుల ఆగ్ర‌హానికి చ‌వి చూడక‌పోవ‌డం మొన్న‌టి ఎన్నిక‌ల్లో విశేషం. రేప‌టి వేళ కూడా బీజేపీ నే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే.. పెరిగే ధ‌ర‌ల‌కు బాధ్య‌త ప్ర‌జ‌లే వ‌హించాలి..ఆ విధంగా ప‌రిణామాలు ఉంటే ఎవ్వ‌రైనా స‌రే చేసేదేం ఉండ‌దు కూడా!

 

మరొకసారి ధరలు పెరగడంతో సామాన్యులకి కష్టాలు తప్పేలా లేవు. ఒకే రోజు ఏకంగా ఈ మూడింటి ధరల్ని పెంచేసింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ముందు నుండి ఐదు రాష్ట్రాల ఎన్నికల తరవాత ధరలు పెరిగిపోతాయి అని అంటూనే ఉన్నారు. అనుకున్న విధంగానే ధరలు పెరిగిపోయాయి. అందరి అంచనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై బాదుడు మళ్లీ ప్రారంభించింది.

పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకోగా.. అదే రోజు గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచేశారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 22 నుంచే రేట్ల పెంపు నిర్ణయం అమలులోకి రావడం జరిగింది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,002కు చేరింది. అలానే డెలివరీ చార్జీలు రూ.30 కలుపుకుంటే ధర రూ.1032 అయ్యింది.

అలాగే ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు చేరింది. చార్జీలు కలుపుకుంటే సిలిండర్ పొందాలంటే రూ.1040 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే మంగళవారం నుంచి డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలని చూస్తే.. ఢిల్లీలో రూ.949 అయ్యింది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.976కు ఎగసింది. లక్నోలో రూ.987కు చేరింది. పాట్నా లో ధర రూ.998 నుంచి రూ.1039కు చేరింది.

gas cylinder
gas cylinder

గ్యాస్ సిలెండర్ ధరలు ఎంత మేర పెరిగాయి అనేది చూస్తే.. అక్టోబర్ 2021 మరియు మార్చి 1, 2022 మధ్య వాణిజ్య సిలిండర్ల ధర రూ. 275 పెరగగా.. మార్చి 1, 2021-2022 మధ్య దేశీయ ఎల్‌పిజి సిలిండర్ల ధర రూ. 81 మాత్రమే పెరిగింది. ఇప్పుడు 50 రూపాయలు పెరగడం తో సామాన్యులకి మరింత కష్టం అయ్యిపోతోంది.మ‌రోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఈరోజు 2 శాతానికి పైగా పెరిగాయి. 118 డాలర్ల పైన కదలాడుతున్నాయి. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచాయి. పెట్రోల్ ధర గురించి చూస్తే.. ఒక లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, లీటరు డీజిల్‌పై 88 పైసలు ధర పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news