మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జవనరి 7న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవల్ లో సినిమాను విడుదల చేస్తుండటంతో అన్ని భాషల్లోనూ ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా పై ఆసక్తికర వార్తలు నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు దేశంలో శరవేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
దాంతో ఇప్పటికే న్యూయర్ పై పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించారు. అంతే కాకుండా పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. అంతే కాకుండా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వాలు సిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదల నాటికి రాష్ట్రాల్లో ఆంక్షలు వచ్చే అవకాశం ఉందనే అనుమానాలతో సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.