కాశ్మీర్ లో మారోసారి కాల్పుల మోతమోగింది. తాజాగా మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసున్నాయి. శనివారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో ఎదురుకాల్పలు చోటు చేసుకున్నాయి.
ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, కార్డన్ సెర్చ్ చేశారు. ఈ క్రమంలోనే దాగిఉన్న ఉగ్రవాదుల భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ కొనసాగుతన్నట్లు పోలీసులు వెల్లడించారు.
అంతకు ముందు శుక్రవారం కూడా జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ముమన్‌హాల్ (అర్వానీ) ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. వరసగా రెండు రోజుల్లో ఎన్ కౌంటర్లు జరగడం కాశ్మీర్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.